Top
logo

నటుడు శివాజీ అరెస్ట్

నటుడు శివాజీ అరెస్ట్
X
Highlights

ప్రముఖ నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలండ మీడియా కేసులో శివాజీ పై కేసు నమోదు చేసిన పోలీసులు...

ప్రముఖ నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలండ మీడియా కేసులో శివాజీ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొంత కాలంగా శివాజీ ఈ కేసు విషయంలో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శివాజీని అరెస్ట్ చేశారు. కాగా, నటుడు శివాజీ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story