Naresh: పోలీస్ స్టేషన్‌కు సీనియర్ నటుడు నరేశ్

Naresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిద్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నరేశ్.

Samba Siva Rao
Published on: 18 April 2021 2:56 PM IST
Actor Naresh Complaints CCS Police
X

 నరేష్ ఫైల్ ఫోటో 

Naresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిద్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నరేశ్. నాలుగు దశాబ్దాలుగా తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నారు. ఆయన వరుస సినిమాలతో తీరకలేక గడుపుతున్నారు. అప్పట్లో హీరోగా ఎన్నో మరపురాని సినిమాల్లో నటించారు. ఈతరం నటీనటులకు తండ్రి పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. సినీమాలతో బీజీగా గడుపుతూనే అదే సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. నరేశ్ తాజాగా ఓ కేసు విషయమై పోలీసులను ఆశ్రయించారు. ఓ కంపెనీపై ఫిర్యాదు చేశారు.

సీనియర్ నటుడు నరేష్ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారం విషయంలో 7.5 కోట్లు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హీరో నరేష్.తనకు ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు... హ్యాండ్ ఫైనాన్స్‌ ద్వారా తీసుకున్నారని తెలిపారు. ఆరేళ్లు దాటినా.. ఇప్పటి వరకు అమౌంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు నరేష్.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story