logo

యువతితో సహజీవనం చేసి.. చివరికి శవాన్ని చేశాడు..

యువతితో సహజీవనం చేసి.. చివరికి శవాన్ని చేశాడు..
Highlights

వారిద్దరికి ఒకరంటే ఒకరి ఎనలేని ప్రేమ. ఒకరిని విడిచిమరోకరు ఉండలేనంతగా. ఎంతగానో ఇష్టపడ్డారు.. అప్పుడే ముద్దు...

వారిద్దరికి ఒకరంటే ఒకరి ఎనలేని ప్రేమ. ఒకరిని విడిచిమరోకరు ఉండలేనంతగా. ఎంతగానో ఇష్టపడ్డారు.. అప్పుడే ముద్దు ముచ్చట తీర్చుకున్నారు. అయితే వీరిమధ్య అనుమానం అనే పేనుభూతమే వీరి మధ్య చిచ్చుపెట్టింది. చివరికి ప్రియురాలిని కాడ తేల్చాడు ఓ ప్రియుడు. ఇక వివరాల్లోకి వెళితే విశాఖ.. తగరపువలస సమీపంలోని చిప్పాడ దివీస్‌ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్న కె.శాంతి ఈనెల 25న ఉరివేసుకుని చనిపోయినట్లు భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు నమ్మెలేని నిజాలు బయటపడ్డాయి. కె.శాంతితో సహజీవనం చేస్తున్న చిన్నారావు అనే యువకుడే పిడిగుద్దులు గుద్ది, పీక పిసికి ప్రాణాలు తీసినట్లు విచారణలో తేలింది.

కాగా మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బాసగిట్టంగి గ్రామంగా గుర్తించారు. ఇకపోతే నిందితుడిది ఆ పక్కనే ఉన్న పెదగిట్టంగి గ్రామం. అయితే ఏడు నెలల క్రితం వీరిద్దరు చిప్పాడ దివీస్‌లో దినసరి కూలీలుగా చేరారు. ఆ సమీపంలోని రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ నెల 25న కూడా వీరిద్దరూ పనులకు వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతి షెడ్డుకి వెళ్లి తలుపులు మూసుకుంది. కాగా కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న చిన్నారావు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టాడు. దీంతో నేను నిన్ను పెళ్లిచేసుకోను. నన్ను నీ ఇష్టమెచ్చినట్లు కొడుతున్నావ్‌.. అని ప్రియుడ్ని గట్టిగ నిలదీసింది. దీంతో ఆవేశాన్ని ఆపులేని ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపినట్లు భీమిలి సీఐ వెంకట నారాయణ తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top