logo
క్రైమ్

చంపేశాడు.. తానే చనిపోయినట్టు నమ్మించాలనుకున్నాడు..దొరికిపోయాడు!

చంపేశాడు.. తానే చనిపోయినట్టు నమ్మించాలనుకున్నాడు..దొరికిపోయాడు!
X
Highlights

కోటి రూపాయల అప్పు.. తీర్చడం కంటే ఎగ్గొట్టటమే మంచిది అనుకున్నాడో ప్రబుద్ధుడు. భార్యతో కలిసి సినిమా లెవెల్ స్క్రీన్ ప్లే సెట్ చేశాడు. పోలీసుల కళ్లుగప్పాలనుకున్నాడు. అందుకోసం ఓ బిచ్చగాడిని చంపేశాడు..

కోటి రూపాయల అప్పు.. తీర్చడం కంటే ఎగ్గొట్టటమే మంచిది అనుకున్నాడో ప్రబుద్ధుడు. భార్యతో కలిసి సినిమా లెవెల్ స్క్రీన్ ప్లే సెట్ చేశాడు. పోలీసుల కళ్లుగప్పాలనుకున్నాడు. అందుకోసం ఓ బిచ్చగాడిని చంపేశాడు.. తాను చనిపోయినట్టు నమ్మించే ప్లాం వేశాడు. అయితే.. పోలీసుల చాక చక్యంతో దొరికిపోయాడు. ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. అతనికి సహకరించిన భార్య కూడా జైలు పాలైంది.

సస్పెన్స్ .. థ్రిల్లర్.. మర్డర్ మిస్టరీని తలపిస్తున్న రియల్ స్టోరీ ఇది. పూణే లో జరిగిన ఈ స్టోరీ వింటే ఔరా అనకుండా ఉండలేరు. పూణే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న కథ ఇదీ..

నవంబర్ 20న హింజెవాడి పోలీస్ స్టేషన్‌ కు ఒక ఫిర్యాదు వచ్చింది. బానర్ ప్రాంతానికి చెందిన మౌలానా హింజే వాడి స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి బాలక్రిష్ణ సావంత్ కు ఒక సమాచారం అందించాడు. ఉదాన్ షాహవాలీ సమీపంలో ఒక కుళ్ళిన మృతదేహం పది ఉందనేది ఆ సమాచార సారాంశం. వెంటనే అక్కడికి చేరుకున్న బాలకృష్ణ సావంత్ దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పంపించారు. ఆ సంఘటనా స్థలంలో రెండు మొబైల్ ఫోన్లు, సగం కాలిన బట్టలు, ఒక చిన్న చీటీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం లో కత్తిపోట్లతో ఆ వ్యక్తి మరణించాడనే.. తరువాత మృత దేహాన్ని కాల్చారని తేలింది. ఇక పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు వేగవంతం చేశారు.

ముందు తమకు దొరికిన ఫోన్లలో ఒక్కొరికి ఫోన్ చేశారు. ఒక వ్యక్తి దగ్గర కీలక సమాచారం దొరికింది. వైసీఎం ఆస్పత్రి ముందుండే ఒక బిచ్చగాడు తన నెంబర్ తీసుకున్నాడని చెప్పాడు ఆ వ్యక్తి. ఈలోపు పూణేలో తప్పిపోయినట్టుగా నమోదు అయినా కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వైసీఎం ఆస్పత్రి వద్ద బీచ్చ్గాడు కనిపించడం లేదని తేలింది. అలాగే వాకాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తప్పిపోయినట్టు ఫిర్యాదు అందింది. ఆస్పత్రి వద్ద సీసీ టీవీలను పరిశీలించిన పోలీసులకు బిచ్చగాడు, వాకాడు లో తప్పిపోయిన వ్యక్తి మాట్లాడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులకు మంచి క్లూ దొరికినట్లయింది. ఆ దిశలో తమ దర్యాప్తు సాగించారు.

ఆ సీసీ టీవీల్లో కనిపించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మరొకరు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో వాకాడు లో తప్పిపోయాడని ఫిర్యాదు పై దృష్టి పెట్టారు. తప్పిపోయిన వ్యక్తి మెహబూబ్ దస్తగిర్ షేక్ (52) అని తెలిసింది. ఆ వ్యక్తికీ సంబంధించిన వస్తువులు తనిఖీ చేస్తున్న క్రమంలో అతనికి చెందిన సూట్ కేస్ లో ఒక చీటీ దొరికింది. దానిలో ఎనిమిది మంది పేరులు ఉన్నాయి. వారి నుంచి ౮౦ లక్షల వరకూ అప్పు తీసుకున్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా, తనకు ఏదైనా జరిగినా.. తాను హత్యకు గురైనా అది వారి పనే అవుతుందని భావించాలని రాసి ఉంది. దీంతో దస్తగిరి భార్యను పోలీసులు ప్రశ్నించారు. అదే సమయంలో దస్తగిరి అక్కడి దగ్గరలోని ఒక రైల్వే స్టేషన్ లో పోలీసులకు చిక్కాడు. దీంతో కేసు చిక్కుముడి విడిపోయింది.

దస్తగిరి పోలీసులకు అసలు విషయం చెప్పాడు. తాను బిచ్చగాడు సందీప్ పుండాలిక్ మెయింకర్ ను హత్య చేసి తానే మరణించినట్టు నమ్మించాలని ప్రయత్నించినట్టు చెప్పాడు. సందీప్‌ను తన బైక్‌పై ఎక్కించుకొని వేర్వేరు ప్రదేశాలలో తిప్పిన దస్తగిరి.. ఉడాన్ షాహ్వాలి సమీపంలో హత్య చేసి, కాల్చినట్లు ఒప్పుకున్నాడు. ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరిపై మరో కేసు కూడా నమోదైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దస్తగిరిని పోలీసులు ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.

ఇలా మాస్టర్ ప్లాన్ వేసిన దస్తగిరి పోలీసులకు దొరికిపోయాడు.


Web TitleA man in Pune planned fake death to avoid loans repayment
Next Story