logo

తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు...

తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు...
Highlights

తినే ఆహారంలో వెంట్రుకలు వస్తే తీసి పక్కన పడేయాలి. కానీ ఓ ప్రబుద్ధుడు తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు కొట్టించాడు . ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని చోటుచేసుకుంది. మహిళా హక్కుల ఉద్యమకారులు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఉసలు లెక్కపెడుతున్నాడు.

ఢాకాలోని జోయ్‌పుర్హాత్ జిల్లాలోని మొండల్ తన భార్య తనకు వడ్డించిన భోజనంలో, పాలల్లో తల వెంట్రుకలు వచ్చాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు ఓ బ్లేడు తీసుకుని భార్యకు గుండుకొట్టాడు. స్థానికులు విషయం తెలుసుకని మానవ హక్కుల సంఘాల నేతకు చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. భార్యను వేధించాడని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు రుజువైతే అతడికి 14ఏళ్ల పాటు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో భార్య పట్ల అహంకార పూరితంగా ప్రవర్తించిన మొండల్ కు తగిన శాస్తి జరిగిందని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

లైవ్ టీవి

Share it
Top