logo

ప్రేయసి వేలు కోసిన ప్రియుడు

ప్రేయసి వేలు కోసిన ప్రియుడు

ప్రేమబంధం వదిలించుకుందన్న కారణంగా మాజీ ప్రేయసి వేలు కోసి పైశాచిక ఆనందం పొందాడు ఓ ప్రియుడు. ఈ ఘటన పూణేలో జరిగింది. మహరాష్ట్ర కోల్హివాడికి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ కావడేకు 9 ఏళ్ల కిందట బ్యూటీపార్లర్ లో పనిచేసి 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. దాంతో వారు ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. కొంతకాలం తర్వాత వారి ప్రేమ బంధానికి ఆమె స్వస్తి చెప్పింది. దాంతో బ్యూటీపార్లర్ విధులుముగించుకోని స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతుండగా యువతిని అడ్డగించాడు. అనంతరం తనతో సంబంధం తెంచుకోవడానికి కారణం ఏంటని కోపంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో లక్మణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె వేలు కోశాడు. తీవ్ర రక్తస్తావం కావడంతో సదరు మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

???? ????

Share it
Top