logo

కూతురిపై లైంగిక వేధింపులు.. 5 ఏళ్ల జైలుశిక్ష..

కూతురిపై లైంగిక వేధింపులు.. 5 ఏళ్ల జైలుశిక్ష..
Highlights

కన్నకూతురిపైనే లైంగికంగా వేధించిన ఓ కామాంధుడి తండ్రికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు.

కన్నకూతురిపైనే లైంగికంగా వేధించిన ఓ కామాంధుడి తండ్రికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు. అయితే గత పదేళ్ల క్రితం భార్య మరణించడంతో కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అయితే గత 2014లో ఇంట్లో ఎవరులేదని సమయంలో సమయంలో కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి వేధింపులు భరించలేక బాలిక వారి బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అయితే రాఖీ పండగకు తన సోదరుడికి రాఖీ కట్టేందుకు రాగా లింగం కుమార్ మరోసారి కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు.

తిరిగి వెళ్లిన తర్వాత బాలిక తను చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆమె డిసిపియూ వారి దృష్టికి తీసుకువెళ్లింది. కాగా ఈ ఘటనతో బాలిక గత జూలై 12, 2014న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నింధితుడితో నిజం కక్కించారు. కేసు విచారించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు శుక్రవారం తుది తీర్పు వెల్లడించారు. కోర్టులో ఛార్జ్‌షీట్ వేయగా తుది సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలుతో పాటు.. రూ. 5,000 జరిమానా విధించింది.


లైవ్ టీవి


Share it
Top