Top
logo

9 నెలల చినారిపై హత్యాచారం

9 నెలల చినారిపై హత్యాచారం
X
Highlights

మానవత్వానికి మచ్చ ఇది. మృగత్వానికి మచ్చుతునక ఇది. దారుణం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది....

మానవత్వానికి మచ్చ ఇది. మృగత్వానికి మచ్చుతునక ఇది. దారుణం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. వరంగల్ జిల్లా హన్మకొండలోని కుమార్పల్లిలో ఓ చిన్నారిపై హత్యాచారం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లిన ఉన్మాది చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటనలో చిన్నారి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పక్క కాలనీలో నివాసముంటున్న ప్రవీణ్‌ అనే యువకుడు ఈదుర్మార్గానికి ఒడిగట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Next Story