Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది కూలీలు దుర్మరణం

16 killed in separate accidents in Pakistans Sindh
x

 Road Accidents: నెత్తరోడిన రహదారులు..16 మంది దుర్మరణం

Highlights

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మరణించారు. అరటితోటలో పనులు ముగించుకుని ఇంటికి...

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మరణించారు. అరటితోటలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించగా..5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని అనంతరం జిల్లా గార్లదిన్నె మండలం దగ్గర 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం పుట్లూరు మండలం ఎల్లుట్లో విషాదాన్ని నింపింది. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

పుట్లూరు మండలం ఎల్లుట్ల నుంచి 60కిలోమీటర్ల దూరంలోని తలగాసుపల్లిలో అరటితోటలో పని చేసేందుకు 12 మంది కూలీలు ఆటోలో వెళ్లారు. తోటలో పని ముగించుకుని తీరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు కబళించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఐదుగురు మరణించారు. ప్రమాదంలోమరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. వీరంతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరంతా ఒకే వీధికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories