Top
logo

పహాడీషరీఫ్‌లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య

పహాడీషరీఫ్‌లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య
X
Highlights

రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌‌లో దారుణం జరిగింది. యూసిన్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు...

రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌‌లో దారుణం జరిగింది. యూసిన్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడిని ఎవరు చంపారనేది తెలియరావడం లేదు. నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని హత్య చేశారు. స్థానికంగా తిరిగే గంజాయి గ్యాంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే అత్యాచారం చేసి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.

Next Story