Female SI: పెళ్లి కావడం లేదని ఆవేదనతో ఎస్సై సూసైడ్

35 year old female sub-inspector Kavita Solanki committed self-destruction not to get married
x

SI Kavita Solanki

Highlights

Female SI: ఎస్సైగా పని చేస్తోన్న కవితా సోలంకి తనకు పెళ్లి కావడం లేదనే ఆవేదనతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

Female SI: మనం ఒక విషయం గురించి అప్పటికే పీలవుతుంటాం.. ఎదుటివాళ్లు అదే విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతూ.. దాని గురించి క్లాసు పీకుతుంటే మనకు ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళుతుంది. అది సున్నితమైన విషయం.. అడగకపోవడం బెటరనే సంగతి మన జనం ఎప్పటికో తెలుసుకుంటారో మరి. ఒక అమ్మాయికి వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి కాలేదు.. ఎందుకు కాలేదు.. ఎందుకు అవటం లేదంటూ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక.. మనసులో ఎంత బాధపడతారో వాళ్లకు తెలియదా.. తెలుసు. తెలిసినా అలా అడిగి ఆనందించేవారే ఎక్కువ. ఇలాంటివారి మాటల దాడిని తట్టుకోలేక ఓ యువతి.. పైగా ఎస్సైగా పని చేసే యువతి ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్. ఎంతో కష్టపడితే గానీ ఆ కొలువును సాధించలేము. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఆ ఘటన ఎదురైంది. ఇదొక్కటే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీ సారి తెలిసిన వారు అడగుతుండటంతో ఆవేదన చెందింది. ఇంటి నుంచి బయలుదేరి డ్యూటీలో జాయిన్ అయింది. అదే రోజు రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.

దీంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటారు అని ఎదుటి వారు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా వుంటాయి. అయినా పెద్ద ఉద్యోగం సంపాదించడమే కాదు, ఎలాంటి ఘటనలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం కూడా మనందరం అలవరుచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories