ఘోర ప్రమాదం.. 21 మంది మృతి

మురాద్‌నగర్‌లో శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లో.. కూలిన గ్యాలరీ పైకప్పు, 21 మంది మృతి ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు

Samba Siva Rao
Published on: 3 Jan 2021 9:41 PM IST
ఘోర ప్రమాదం.. 21 మంది మృతి
X

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 21మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

శశ్మాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అటు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక జరిగిన ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని మీరట్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story