Top
logo

ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం: 10మంది మృతి

ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం: 10మంది మృతి
Highlights

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే...

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. అయితే పోలీసుల వివరాల ప్రకారం ఎన్ హెచ్ -33 పై ఎదురుగా వస్తున్న ఓ లారీ,కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఔరంగాబాద్‌(బిహార్‌) నుంచి రాంచీకి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుండి తప్పించకపోయాడని సమాచారం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే కేవలం కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతుల్ని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

Next Story


లైవ్ టీవి