logo

తండ్రి అస్థికలు ఎక్కడ దాచుకుందంటే... వైరల్ వీడియో

తండ్రి అస్థికలు ఎక్కడ దాచుకుందంటే...  వైరల్ వీడియో
Highlights

చిన్నప్పటి నుంచి అల్లరుముద్దుగా పెంచున్న తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది ఓ కుమార్తె. తండ్రి తనతో పాటు ఉన్నాడనే భావన కాలగాలని ఓ కుతూరు ఏకంగా ఆమె తండ్రి అస్థికలు తన గోర్లలో భద్రంగా దాచుకుంది.

చిన్నప్పటి నుంచి అల్లరుముద్దుగా పెంచున్న తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది ఓ కుమార్తె. తండ్రి తనతో పాటు ఉన్నాడనే భావన కాలగాలని ఓ కుతూరు ఏకంగా ఆమె తండ్రి అస్థికలు తన గోర్లలో భద్రంగా దాచుకుంది. ఈ సంఘటన లండన్‎లో చోటు చేసుకుంది. ‎వివరాల్లోకి వెళ్తే.. లండన్‌కు చెందిన చార్టొట్ వాట్స్‌న్ అనే యువతి సుమారు నాలుగు నెలల క్రితం తన తండ్రి విక్ బార్భర్‌ను కోల్పోయింది. విక్ బార్భర్ క్యాన్సర్ కారణంగా తనువుచాలించాడు. తండ్రి మరణించడంతో ఆమె కుంగిపోయింది. తండ్రి తన మధ్య లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో తండ్రి మరణానికి ముందే వాట్సన్‌కు మరో వ్యక్తి వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి కొద్దీ రోజులు ముందు తండ్రి మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. చార్లొట్ వాట్స్‎న్‌కు ఆమె సోదరి నెయిల్ ఆర్టిస్ట్ ఓ సలహాచ్చింది. దీంతో ఆమె తండ్రి అస్థికలు గోర్లలో అమర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం చార్లొట్ గోర్లు పొడవుగా లేకపోయినా, కృత్రిమంగా అతికించి గోర్లకు అస్థికలను అంటించింది. తర్వాత ఆ గోర్లను అందంగా తీర్చి దిద్దించుకుంది. దీని సంబంధించిన విడియోను యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసింది. చొర్లొట్ మాట్లాడుతూ.. తన తండ్రి తనతోనే ఉన్నాడనే భావన కలుగుతోందని పేర్కొంది. ఇప్పుడు చార్లొట్ వీడియో యూట్యూబ్ లో వైరల్‌గా మారింది.



లైవ్ టీవి


Share it
Top