ఆయన మౌన దీక్ష ఎందుకో....

ఆయన మౌన దీక్ష ఎందుకో....
x
Highlights

ఆయనొక జడ్పీ చైర్మన్....ఆయన ఏమి చేసినా జిల్లా మొత్తం మారుమోగుతుంది. పేరుకు జిల్లా ప్రధమ పౌరుడు అయినప్పటికీ, జిల్లాలో ఎవరికి అంతుపట్టని మనస్తత్వం. తన ...

ఆయనొక జడ్పీ చైర్మన్....ఆయన ఏమి చేసినా జిల్లా మొత్తం మారుమోగుతుంది. పేరుకు జిల్లా ప్రధమ పౌరుడు అయినప్పటికీ, జిల్లాలో ఎవరికి అంతుపట్టని మనస్తత్వం. తన సిబ్బంది పొరపాటున ఏచిన్న తప్పు చేసినా తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకొనే అలవాటు. జిల్లా పరిషత్ ఉద్యోగులతో పాటు జిల్లా ప్రజలకు సైతం ఆయన ప్రవర్తన ఒక వింతలా కనబడుతోంది ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తు వార్తల్లో నిలిచే ఆయన ఇప్పుడు తాజాగా మౌన దీక్ష చేపట్టాడు.. ఇంతకు ఆయన మౌన దీక్ష ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఈదర హరిబాబు.. ప్రకాశంజిల్లా జిల్లాపరిషత్ చైర్మన్. ఈదర హరిబాబు ఒకప్పుడు టీడీపీలో సీనీయర్ నాయకుడు. పలుమార్లు పసుపు పార్టీ అధిష్టాన నిర్ణయాలకు ఎదురు తిరిగి రెబల్ గా పోటీ చేసిన నాయకుడు. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఈదర చేసిన రాజకీయం ఈదరను సైకిల్ పార్టీకి దూరం చేసింది. అయితేనేం పార్టీ పోయినా చైర్మన్ గిరి దక్కించుకున్నాడు కానీ కొద్ది రోజుల్లోనే అది కూడా ఊడిపోయింది. అయిన బెదరకుండా సుప్రీం కోర్టుకు వరకు వెళ్లి పోరాడి చైర్మన్ కుర్చీని దక్కించుకున్నాడు చైర్మన్ పీఠం ఎక్కిన నాటి నుండి ఏదో ఒకటి చేస్తూ జిల్లాలో హాట్ టాపిక్ వుండేవాడు ఎంతలా అంటే జెడ్పీ సభ్యులతో పాటు ఉద్యోగులు,జిల్లా ప్రజలు సైతం ఆశ్చర్యపరిచేలా.

ఎలా అంటే జెడ్పీ ఉద్యోగులలో సత్ర్పవర్తన పేరుతో ఒసారి దీక్ష చేపడితే..మరోసారి అవినీతికి వ్యతిరేకంగా మరోసారి దీక్ష చేపట్టాడు...చివరకు జెడ్పీ సమావేశాలలో సైతం ఏదో ఒక పేరుతో దీక్ష చేపట్టడం...ఈదరకు పరిపాటిగా మారింది..ఎప్పుడూ ఎవరికి అంతుపట్టని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వుండటం ఈదర హరిబాబు స్టైల్. గతంలో ఓ జెడ్పీ స్కూల్లో జరిగిన చిన్న తప్పుకు తనకు తానే శిక్ష వేసుకుంటున్నాను అంటూ కొంతసేపు ఎండలో నిలబడ్డాడు.

జెడ్పీ సమావేశాల్లో కూడా ఎప్పుడు ఏం మాట్లాడితే ఏం దీక్ష చేపడతాడో అని సభ్యులు, ఉద్యోగులు భయపడేలా దీక్ష చేపడతాడు.. ఇతని ప్రవర్తన చూస్తున్న ఉద్యోగులను సైతం ఆశ్చర్యపరిచేలా వింత నిర్ణయాలను తీసుకుంటూ వుంటాడు. జెడ్పీ సమావేశాలకు జిల్లా కలెక్టర్ హజరుకాకపోవడాన్ని నిరసిస్తూ ఈదర మౌన దీక్ష చేపట్టాడు. తమ సమస్యల కోసం వచ్చే వారు ఏది అడిగినా పేపర్‌పై రాసివ్వడం చూసి ప్రజలతో పాటు జడ్పీ ఉద్యోగులు సైతం షాక్ వుతున్నారు.

ఈదర మౌన దీక్ష చేపట్టి వారం దాటింది. ఈ వారం నుండి ఈదర సైగలు తోనే కాలం నెట్టుకొస్తున్నారు. అసలు ఈయన గారు మౌనదీక్ష ఎందుకు చేపట్టారా అని ఆరా తీసిన వాళ్లు, విషయం తెలుసుకున్నాక నోళ్లు వెళ్లబెడతున్నారు. వచ్చే జడ్పీ జనరల్ సమావేశాల వరకు ఈ దీక్షను ఈదర కొనసాగించునున్నారు. ఈదర మౌన దీక్షకు ప్రకాశం జిల్లాలో ఎంపీపీలు, జడ్పీటీసీలు మద్దత్తుగా నిలుస్తున్నారు.

మరోవైపు గత కొంతకాలంగా జడ్పీ సమావేశాలకు, మంత్రి తో పాటు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు హాజరవకపోవడంతో పాటు...స్ధానికి సంస్ధల సంస్కరణలే లక్ష్యంగా రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తెచ్చేందుకే ఈదర మౌనదీక్ష చేస్తున్నట్లు చెపుతున్నారు. స్ధానిక సంస్ధల్లో వున్న నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటూ... జిల్లా పరిషత్, పంచాయితీలను నిర్వీర్యం చేస్తుందని ఈదర కినుక వహించారు. మరి ఈదర మౌన దీక్ష ప్రభుత్వాన్ని కదలిస్తుందా?

Show Full Article
Print Article
Next Story
More Stories