ఒకరితో పెళ్లి.. మరొకరితో జీవితం

మంచిర్యాల జిల్లా రాంనగర్‌లో ఓ వివాహిత ఆందోళనకు దిగింది. తనకు న్యాయం కావాలంటూ భర్తింటి ముందు బైఠాయించింది. ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం తేవాలని వేధించాడని ఆరోపిస్తున్న బాధితురాలు అదనపు కట్నం తేనందుకు తనను ఇంటి నుంచి తరిమేసి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Arun Chilukuri
Published on: 29 Dec 2018 11:07 AM IST
Ramnagar
X
Ramnagar

మంచిర్యాల జిల్లా రాంనగర్‌లో ఓ వివాహిత ఆందోళనకు దిగింది. తనకు న్యాయం కావాలంటూ భర్తింటి ముందు బైఠాయించింది. ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం తేవాలని వేధించాడని ఆరోపిస్తున్న బాధితురాలు అదనపు కట్నం తేనందుకు తనను ఇంటి నుంచి తరిమేసి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుటకు చెందిన లాస్యకు మంచిర్యాల జిల్లా రాంనగర్‌కు చెందిన గజ్జెల శివశంకర్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే, ఆడపిల్ల పుట్టాక అదనపు కట్నం కోసం వేధించిన భర్త లాస్యను పుట్టింటికి పంపిచి రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

అదనపు కట్నం వేధింపులు, భర్త రెండో పెళ్లికి వ్యతిరేకంగా లాస్య వినూత్న నిరసనకు దిగింది. రెండో పెళ్లికి ముందు శివశంకర్‌ వివాహేతర సంబధం ఫొటోలతో ధర్నా నిర్వహిస్తోంది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న శివశంకర్‌ను కఠినంగా శిక్షించాలని లాస్య డిమాండ్‌ చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story