అవిశ్వాసమే అస్త్రంగా దూసుకువెళ్తున్న వైసీపీ

అవిశ్వాసమే అస్త్రంగా దూసుకువెళ్తున్న వైసీపీ
x
Highlights

అయితే ప్రత్యేక హోదా, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ... అసలు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు, పోనీ ప్రత్యేక ప్యాకేజీకి అంతా కలిసి ఎందుకు...

అయితే ప్రత్యేక హోదా, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ... అసలు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు, పోనీ ప్రత్యేక ప్యాకేజీకి అంతా కలిసి ఎందుకు పట్టుబట్టడం లేదంటూ ఏపీ ప్రభుత్వం టీడీపీపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, హోదా వల్ల రాయితీలు వస్తాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా మాటెత్తుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదెలా ఉన్నా... నేటి నుంచి జరగనున్న మలివిడత పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒకరు అవి‌శ్వాసంతో సై అంటుంటే, మరొకరు మాటలతో సాధించాలని భావిస్తున్నారు.

ఏపీ ప్రత్యేక హోదా సెగ హస్తినను తాకింది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ప్రత్యేక హోదా ఈ సమావేశాలయ్యే లోపు సాధించుకోవాలనే దిశగా అన్నీ పార్టీలు ముందడుగులేస్తున్నాయి.

ఈసారి సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు మిత్ర పక్షమైన టీడీపీ సైతం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రేపటి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. వైసీపీ అవిశ్వాసమే ఆఖరి అస్త్రంగా ముందుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించకుంటే ఈనెల 21న పార్లమెంట్‌లో అవి‌శ్వాస తీర్మానం పెడతామని ఆ పార్టీ అధినేత జగన్‌ హెచ్చరించారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌ సైతం కేంద్రం తీరుపై మండిపడుతుంది. ఇప్పటి వరకూ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు నేరవేర్చలేదని, ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాని కచ్చితంగా ఇచ్చితీరాని, ఏపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.

ఇక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, రాయితీలొస్తాయని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉంటారని ఏపీ ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. కేంద్రాని మద్దతుగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో అన్యాయం జరిగినప్పటి నుంచి పెదవి విరుస్తుంది. కేంద్రం ఇచ్చిన మాట తప్పిందని ఎలాగౌైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని తెలుగుదేశం నేతలు ప్రజలకు వాగ్దానాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories