వైసీపీ ఎంపీల వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకొచ్చింది?

వైసీపీ ఎంపీల వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకొచ్చింది?
x
Highlights

కర్ణాటక రాజకీయ పరిణామాల తో వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం మరో మారు తెర పైకి వచ్చింది. ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించిన...

కర్ణాటక రాజకీయ పరిణామాల తో వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం మరో మారు తెర పైకి వచ్చింది. ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించిన స్పీకర్... వైసీపీ ఎంపీల రాజీనామాలపై తాత్సారం చేస్తున్నారు. నెల రోజుల తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు పిలుపు వచ్చింది. తమ రాజీనామాలపై వైసీపీ ఎంపీలు నిజంగానే సీరియస్ గా ఉన్నారా, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై స్పెషల్ స్టోరీ.

వైసీపీ ఎంపీల రాజీనామా మరో సారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నాటకకు చెందిన ఇద్దరు లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ ఆమోదించారు. నెలక్రితం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలు చెలరేగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటంలో భాగంగా వైసీపీ కి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేసి నెల రోజులు దాటినా ఇంతవరకూ లోక్ సభ స్పీకర్ ఆమోదించలేదు. మరో వైపు వైసీపీ ఎంపీలు సైతం తమ రాజీనామాలు ఆమోదం కోసం ప్రయత్నం చేయడం లేదు.

తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. వీరిద్దరు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వెంటనే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకపోవడంపై స్పీకర్ తీరు విస్మయం కలగిస్తోంది. లోక్ సభ స్పీకర్ కార్యాలయం వైసీపీ ఎంపీలకు పిలుపువచ్చింది. ఈ నెల 29 సాయంత్రం 5గంటలకు స్పీకర్ ను వారు కలువనున్నారు. వైసీపీ ఎంపీల అభిప్రాయాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలుసుకోనున్నారు. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదం కోసం స్పీకర్ పై ఒత్తిడి తెస్తారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.

ఎంపీల రాజీనామాపై వైసీపీ సీరియస్ గా ఉంటే ఇప్పటికే రాజీనామాలు ఆమోదం పొందేవి అని అధికార టీడీపీ విమర్శలు చేస్తోంది. వైసీపీ,బీజేపీ లాలూచీలో భాగంగానే రాజీనామా డ్రామాలు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కర్నాటక బీజేపీ ఎంపీల రాజీనామాల ఆమోదాన్ని గుర్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉంటేనే ఉప ఎన్నికలు వస్తాయి.అయితే ఇంకా సాధారణ ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అసలు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయా లేదా అనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories