మహిళ మంత్రులపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

మహిళ మంత్రులపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఇక్కడి మహిళా మంత్రులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు....

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఇక్కడి మహిళా మంత్రులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ‘మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?’ అంటూ చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సమావేశంలో మరో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీడీపి నాయకులు ఇసుక, మట్టి గ్రానైట్ ఏ ఒక్కదాన్ని వదలడం లేదన్నారు. ఇక్కడ కట్టుకున్న మరుగుదొడ్లకు బెంగళూరు బ్యాంకు అకౌంట్లకు నిధులు విడుదల అవుతున్నాయని అన్నారు. జిల్లాలో విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు మూసివేశారో చెప్పకుండా తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories