ఆయన విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ‌

ఆయన విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ‌
x
Highlights

టీడీపీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కడుపు నిండా తిని స్పీకర్ లేని సమయంలో ఆ రూంలో దొర్లుతారుగానీ, పక్కనే ఉన్న ప్రధాని...

టీడీపీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కడుపు నిండా తిని స్పీకర్ లేని సమయంలో ఆ రూంలో దొర్లుతారుగానీ, పక్కనే ఉన్న ప్రధాని నరేంద్రమోడీ రూంకు వెళ్లే ధైర్యం లేదని మండిపడ్డారు. కిలో మీటర్ దూరం ముందు నుంచే మోడీ ఇంటిపై దాడి అంటూ మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సుల్లో ఎక్కేసి..పోలీసులు తమను బస్సుల్లో కుక్కేశారని చెబుతున్నారని విమర్శించారు. మీడియా కోసం ధర్నాలు చేసి, భోజనం సమయానికి పరుగెడతారని, వీళ్లు మా ఎంపీలను విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని తెలుగు దేశం ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘‘మూడు సెంటీమీటర్ల వర్షానికే తాత్కాలిక సెక్రటేరియట్‌ భవనంలోకి ఆరు సెంటీమీటర్ల నిళ్లొచ్చాయి. 13 మంది మంత్రుల పనితీరు భేష్‌ అని సీఎం అంటున్నారు. అవునుమరి.. ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకు ఈ కితాబు దక్కాల్సిందే! నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లని పరిస్థితి. ఇక పవన్‌ కల్యాణ్‌ హోదా కోసం కనీసం రెండు కిలోమీటర్లైనా నడవటం సంతోషం’’ అని రోజా పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories