జగన్‌ సీఎం కావడం ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

nanireddy
Updated on: 24 Dec 2018 4:05 PM IST
జగన్‌ సీఎం కావడం ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి
X

చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్‌సీపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. నగరి ఎమ్మెల్యే రోజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై నగరి ఎమ్మెల్యే రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ఆమెను అభినందించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తధ్యమని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

nanireddy

nanireddy

Next Story