ఎమ్మెల్యేగా నేడు వైసీపీ నేత ప్రమాణం

nanireddy
Updated on: 24 Dec 2018 4:41 PM IST
ఎమ్మెల్యేగా నేడు వైసీపీ నేత ప్రమాణం
X

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు(బుధవారం) వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిప్పేస్వామి చేత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిఅలావుంటే 2014 ఎన్నికల్లో ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్ధించింది. దాంతో ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై ఈరన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఈరన్నకు చుక్కెదురైంది.

nanireddy

nanireddy

Next Story