టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తమ్మినేని

nanireddy
Updated on: 24 Dec 2018 4:37 PM IST
టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తమ్మినేని
X

టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. స్యాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా చేసిన చరిత్ర తెలుగుదేశం నేతలది. వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేశారని ప్రశ్నించారు. పదే పదే జగన్ కేసుల గురించి విమర్శలు చేసే రవి చరిత్ర అందరికి తెలుసని అన్నారు. పాదయాత్రలో జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.

nanireddy

nanireddy

Next Story