కాసేపట్లో పోలీస్ విచారణకు హాజరుకానున్న వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌

arun
By arun
Updated on: 24 Dec 2018 3:50 PM IST
కాసేపట్లో పోలీస్ విచారణకు హాజరుకానున్న వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
X

వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కాసేపట్లో గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసుల ముందు హాజరుకానున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తేనంటూ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు విచారణకు రావాలంటూ ఈ నెల మూడున నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న ఆయన అనుచరులతో కలిసి విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో అనుచరులతో కలిసి ఆయన అరండల్ పేట చేరుకోనున్నారు.

arun

arun

Next Story