చంద్రబాబుకు శిక్ష తప్పదు: బొత్స

చంద్రబాబుకు శిక్ష తప్పదు: బొత్స
x
Highlights

జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పత్రికల్లో కథనాలు రాయిస్తూ అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు....

జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పత్రికల్లో కథనాలు రాయిస్తూ అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీని అణిచి వేసేందుకు అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. రాజన్న రాజ్యాన్ని జగన్ తీసుకువస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, అందుకు నిదర్శనం ఆయన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణే అని అన్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన ఘటన దారుణమని, సభ్యసమాజం తలదించుకునేట్టుగా ఇది ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories