డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ అనూహ్య నిర్ణయం...

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ అనూహ్య నిర్ణయం...
x
Highlights

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది... ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని...

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది... ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతూ వచ్చిన ఆ పార్టీ... ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థికి డిప్యూటీ చైర్మన్ గా అవకాశమిస్తానని తొలుత చెప్పి, ఆపై తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దించిందని, ఆ విషయాన్ని ముందుగా తమతో చర్చింలేదని విజయసాయి ఆరోపించారు. రాష్ట్రంలో శత్రువుల మాదిరిగా ఉంటూ, కేంద్రంలో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని చేతులు కలిపి, కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి సైతం తాము మద్దతు ఇవ్వబోవడం లేదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories