జగన్‌కు జడ్ ప్ల‌స్ సెక్యూరిటీ కల్పించాలని వైసీపీ డిమాండ్

x
Highlights

వైసీపీ అదినేత‌ జ‌గ‌న్ భద్రతపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి నేపథ్యంలో జగన్‌కు భద్ర‌త మరింత పెంచాలని డిమాండ్...

వైసీపీ అదినేత‌ జ‌గ‌న్ భద్రతపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి నేపథ్యంలో జగన్‌కు భద్ర‌త మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో పాద‌యాత్ర ప్రారంభం కానున్న నేప‌ద్యంలో జ‌గ‌న్ సెక్యురిటీపై వైసీపీ నేతలు ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టారు. విశాఖలో కత్తి దాడి జరిగాక వైద్యుల సూచన మేరకు ప్రజా సంకల్ప యాత్రకు విరామమిచ్చిన జగన్ మూడు రోజుల్లో మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. న‌వంబ‌ర్ మూడ‌వ తేదీన‌ విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌ర్గం నుంచి పాద‌యాత్ర మొద‌లు పెడుతున్నారు. కత్తి దాడి జరిగాక చేస్తున్న పాద్రయాత్ర కావడంతో వైసీపీ అధినేత భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.

ఇప్పటి వరకు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో దాదాపు 80 మంది ప్రభుత్వ , ప్రవైటు సెక్యూరిటీ సిబ్బంది విదులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరిలో జ‌గ‌న్ కు వ్య‌క్తిగ‌త సిబ్బందిగా ప్ర‌భుత్వం ఇచ్చిన‌ 10 మందితో పాటు ఆయన ప్రైవేటు సెక్యురిటీ సిబ్బంది 15 మంది, రిటైర్డ్ ఆర్మీ కి చెందిన వారు మరో 5 మంది ఉన్నారు. అలాగే రోప్ పార్టీ‌లో దాదాపు 50 మంది ఎఆర్. కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇంకా పాద‌యాత్ర చేస్తున్న ఏరియాని బట్టి లోక‌ల్ గా సివిల్ పోలీసులు బందోబ‌స్తు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు వంద మందికి పైగా భద్రతా సిబ్బంది జగన్ పాద‌యాత్ర‌లో భద్ర‌త‌ ఇస్తున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టులో దాడి నేపథ్యంలో జగ‌న్ భద్ర‌త‌ను మ‌రింత పెంచాల‌ని వైసీపి నేత‌లు ఇప్పటికే కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను క‌లిసిన వైసీపీ నేత‌లు జ‌గ‌న్ కు కేంద్రమే రక్షణ కల్పించాలని కోరారు. జ‌గ‌న్ కు ప్రాణ‌హాని ఉంద‌నీ ఆయ‌న‌కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ కేటాయించాల‌ని రాజ్ నాథ్‌కు విన్న వించారు. దీంతో పాటు జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న‌ వాహ‌నాల పిట్ నెస్ సరిగా లేదనీ ఆ కాన్వాయ్‌ని కూడా మార్చాల‌ని డిమాండ్ చేశారు. అటు జగన్‌ ప్రభుత్వ కల్పించే భద్రత సంగతి ఎలా ఉన్నా ప్రైవేటు భద్రతా సిబ్బందిని మాత్రం భారీగా పెంచాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్‌కు సెక్యురిటీగా ఉన్న 15 మంది బృందాన్ని 50కి పెంచాలని నేతలు డిసైడ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories