వైయస్ రాజారెడ్డిగా జగపతిబాబు.. డిసెంబర్ 21న..

nanireddy
Updated on: 24 Dec 2018 3:43 PM IST
వైయస్ రాజారెడ్డిగా జగపతిబాబు.. డిసెంబర్ 21న..
X

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవితంలో ఓ భాగమైన పాదయాత్రపై సినిమా ‘యాత్ర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు రోజులు ప్యాచ్‌వర్క్‌ మినహా పూర్తయింది. డిసెంబర్‌ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న నిర్మాతలు మాట్లాడుతూ.. 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు, రైతుల ఆవేదన తెలుసుకున్న వైయస్ జీవిత భాగంపై సినిమా తీయడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. వైయస్ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించామని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. అన్నారు.

nanireddy

nanireddy

Next Story