నేడు ప్రజాసంకల్ప యాత్రపై మాట్లాడనున్న వైయస్ విజయమ్మ

nanireddy
Updated on: 24 Dec 2018 3:57 PM IST
నేడు ప్రజాసంకల్ప యాత్రపై మాట్లాడనున్న వైయస్ విజయమ్మ
X

వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర, ఇటీవల జగన్ పై జరిగిన దాడి గురించి మీడియాతో మాట్లాడనున్నారు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ. జగన్ పై దాడి జరిగిన తరువాత మొదటిసారి విజయమ్మ మీడియా ముందుకు వస్తున్నారు. ఇదిలావుంటే 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన 11న బయలుదేరి అదే రోజు రాత్రికి పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు సోమవారం ఉదయం నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. కాగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం తెలిపారు.

nanireddy

nanireddy

Next Story