తిరుమలకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని ఆ పార్టీకి చెందిన
మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 8న ప్రజా సంకల్ప యాత్ర పూర్తికాగానే జగన్ తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకుంటారని మిథున్ రెడ్డి వెల్లడించారు. కాగా నిన్న ఉదయం మిథున్‌రెడ్డి తన తండ్రి శాసనసభ ఉప ప్రతిపక్షనేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జగన్ శ్రీవారిని దర్శించుకుంటారని వెల్లడించారు.
Next Story




