పాదయాత్ర శిభిరానికి వైయస్ జగన్

nanireddy
Updated on: 24 Dec 2018 3:57 PM IST
పాదయాత్ర శిభిరానికి వైయస్ జగన్
X

గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత వైయస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. 16 రోజుల విరామం అనంతరం జగన్ తన పాదయాత్రను సోమవారం నుంచి కొనసాగించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడినుంచి రోడ్డుమార్గాన పాదయాత్ర శిబిరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం నుంచి సాలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఇదిలావుంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

nanireddy

nanireddy

Next Story