నేడు 'శ్రీకాకుళంలో' వైసీపీ భారీ భహిరంగసభ

nanireddy
Updated on: 24 Dec 2018 4:28 PM IST
నేడు శ్రీకాకుళంలో వైసీపీ భారీ భహిరంగసభ
X

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం నాటికి 316వ రోజుకు చేరింది. నేడు ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఫరీదుపేట నుంచి పాదయాత్రగా
జగన్.. శ్రీకాకుళం నగర సరి హద్దులోకి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలియజేశారు. జగన్ శ్రీకాకుళం రానున్న నేపథ్యంలో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి తదితరుల ఆధ్వర్యంలో నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

nanireddy

nanireddy

Next Story