సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్ జగన్

X
Highlights
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం...
arun15 Jan 2018 6:53 AM GMT
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్ వద్ద ఆయన పండుగ వేడుకల్లో ఉత్సాహంగ పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్ జగన్.. పంచె, కండువా ధరించారు. పారకాల్వలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ప్రజలకు జగన్ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు.
Next Story