900 కి.మీ దాటిన జగన్ పాదయాత్ర

900 కి.మీ దాటిన జగన్ పాదయాత్ర
x
Highlights

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం నాటికి 900 కిలోమీటర్లు దాటింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి...

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం నాటికి 900 కిలోమీటర్లు దాటింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా దాదాపు మూడు వేల కిలోమీటర్లు, ఆరు నెలలపాటు జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్ రావి మొక్కను నాటారు.
ys jagan padayatra completes 900 kms in chittoor - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories