చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం...గత ఎన్నికల హామీలే లక్ష్యంగా మరో ఉద్యమం

చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం...గత ఎన్నికల హామీలే లక్ష్యంగా మరో ఉద్యమం
x
Highlights

2019 ఎన్నికలే టార్గెట్ గా ఏపీ ప్రతిపక్షనేత జగన్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారా? హోదా ఉద్యమంతో చంద్రబాబును ఇరుకున పెట్టిన జగన్ అధికార పార్టీని...

2019 ఎన్నికలే టార్గెట్ గా ఏపీ ప్రతిపక్షనేత జగన్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారా? హోదా ఉద్యమంతో చంద్రబాబును ఇరుకున పెట్టిన జగన్ అధికార పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు మరో అస్త్రాన్ని సిద్ధం చేశారా ? క్షేత్ర స్ధాయి నుంచి ప్లాన్ బీ అమలు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేశారా ? అంటే అవుననే సమాధానం జగన్ సన్నిహితులతో నుంచి పీకే టీం వరకు వినిపిస్తోంది. అధికార పార్టీపై జగన్ ప్రయోగించే అస్త్రం ఏంటో మీరు చూడండి

2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫడెన్స్‌తో అధికారానికి దూరమయ్యానని నిర్ధారణకు వచ్చిన జగన్ 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కగా అడుగులు వేస్తున్నారు. గడచిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూనే మరో సారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రత్యేక హోదా పోరాటంతో పార్టీ ఫామ్ లోకి వచ్చిందని భావిస్తున్న జగన్ రాబోయే పది నెలల్లో కూడా ఇదే తరహాలో జోరు కొన‌సాగించ‌డానికి ప్రణాళిక‌లు సిద్ధం చేశారు. హోదా ఉద్యమంతో పట్టణాలు, నగరాల్లో పార్టీకి ఆదరణ పెరిగిందని నిర్దారణకు వచ్చిన జగన్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించారు. రైతులు, మహిళలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే నవరత్న హామీలను ప్రకటించిన ఆయన చంద్రబాబు 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు స్థితిగ‌తుల‌ను వివరిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు స‌మాచారం

ఇందులో భాగంగా జ‌గ‌న్ నేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన దిశానిర్ధేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్ర‌త్యేక హోదా పై పోరాటం చేస్తూనే మ‌రో వైపు బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు తీరుతెన్నుల‌పై కూడా జ‌నంలో చైత‌న్యం తీసుకురావ‌డానికి వైసీపీ బాస్ రంగం సిధ్దం చేశారని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. పార్టీలో పెద్ద‌స్థాయి నేత‌లందరూ ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేస్తే రెండో స్థాయి నేత‌లు ఎమ్యెల్యేలు, నియోజ‌క వ‌ర్గ ఇన్ చార్జ్ లు బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ఏ మేర‌కు అమ‌లు చేశారో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో దాదాపు 600 పై చిలుకు హామీలు ఇచ్చారు అయితే వాటీ అమ‌లు మాత్రం అంతంత‌మాత్రంగా ఉంద‌ని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అదే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ త‌న టీమ్ కి సూచించిన‌ట్లు స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో బాబు హామీల‌ను అమ‌లులో లోటు పాట్లుల‌ను ఎండ‌గ‌ట్ట‌ల‌ని వైసీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే అదే స‌మ‌యంలో ప్ర‌త్యేహోదా అంశం పై బాబు తీరును సినియ‌ర్ నేత‌లు ఎండ‌గ‌ట్ట‌ల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం మొత్తానికి వైసీపీ అవ‌లంబిస్తోన్న ద్విముఖ వ్యూహాం ఏ మేర‌కు సక్సెస్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories