శ్రీకాళహస్తిలో జగన్‌కు తప్పిన ప్రమాదం

శ్రీకాళహస్తిలో జగన్‌కు తప్పిన ప్రమాదం
x
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తిలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో సభా వేదిక కూలి పోయింది. ఈ ప్రమాదంలో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తిలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో సభా వేదిక కూలి పోయింది. ఈ ప్రమాదంలో జగన్ సురక్షితంగా బయటపడ్డారు. పది మంది వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ప్రజల కష్టాలు, కడగండ్లను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. జగన్ పాదయాత్ర 67వ రోజు జగన్‌ చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories