Top
logo

దారుణం.. వివాహితపై నలుగురు యువకులు అత్యాచారం..

దారుణం.. వివాహితపై నలుగురు యువకులు అత్యాచారం..
X
Highlights

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు ముస్లిం యువకులు వివాహితపై సామూహిక...

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు ముస్లిం యువకులు వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు. ఒంటరిగా ఉన్న వివాహితను అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో సోమవారం (జూన్ 18) రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళ 100కు డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 100కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్‌పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్‌పీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధమైన ఘటనలు చోటు చేసుకోవడం భాధాకరమని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story