ఓటుపై ఓ యువకుడి వినూత్న ప్రచారం

ఓటుపై ఓ యువకుడి వినూత్న ప్రచారం
x
Highlights

ఇది ఎన్నికల సమయం జోరుగా కాసుల వర్షం కురుస్తుంది. ఓట్లను కొనేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతారు మద్యం పంచుతారు బహుమతులు అందిస్తారు కాని...

ఇది ఎన్నికల సమయం జోరుగా కాసుల వర్షం కురుస్తుంది. ఓట్లను కొనేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతారు మద్యం పంచుతారు బహుమతులు అందిస్తారు కాని నేటి తరంలో చైతన్యం వచ్చింది. నోటుతో ఓటును కొనలేరంటూ చెబుతున్నారు. కరీంనగర్ లో ఓ యువకుడి ప్ల కార్డు అందరిని ఆలోచింపజేస్తోంది.

ఓటుకు నోటు మీరు మాకు ఓటేయ్యండి మేము మీకింతిస్తామంటారు నగదు, మద్యం, నజరానాలతో ఓటర్లకు ఎరలు వేయడం అభ్యర్థులకు అలవాటు. కరీంనగర్ కు చెందిన అలీం పండ్ల వ్యాపారి. రోజంతా కష్ట పడితే వచ్చేది చాలా తక్కువ. ఉన్నది పేదరికంలో ఎన్నికల సమయంలో కొంత సంపాదించుకునే అవకాశం ఉంది. అయినా తన ఆత్మగౌరవాన్నిఅమ్ముకోకూడదని భావించాడు.

కరీంనగర్ పట్టణంలో పండ్ల వ్యాపారి అలీం ప్ల కార్డుతో అందరిని ఆలోచింపజేస్తున్నాడు. తను పండ్లు అమ్ముకుంటాను ఓటు అమ్ముకోను అంటూ ఓ ప్ల కార్డు పెట్టాడు. దాన్ని ప్రచారానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి చూపిస్తున్నాడు. పండ్లు కొనేందుకు వచ్చినవారు ఈ యువకుడి తీరు చూసి ఆశ్చర్యానికి గురవుతూనే నువ్వు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో తనకు నచ్చిన నాయకుడికే ఓటు వేసి గెలిపించుకుంటానంటూ చెబుతున్నాడు అలీం. నేతల వద్ద డబ్బులు తీసుకునే ఓటు వేసే వారంతా అలీంను ఆదర్శంగా తీసుకుని ఓటును అమ్ముకోకుండా ఉండాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories