ప్రేయసి పెళ్లి చెడగొట్టి.. ప్రేమికుడి ఆత్మహత్య

x
Highlights

ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ఉద్రిక్తం చోటు చేసుకుంది. వెంకటకృష్ణ అనే యువకుడి ఆత్మహత్యకు.. ప్రియురాలి బంధువుల బెదిరింపులే కారణమని, మృతుని బంధువులు...

ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ఉద్రిక్తం చోటు చేసుకుంది. వెంకటకృష్ణ అనే యువకుడి ఆత్మహత్యకు.. ప్రియురాలి బంధువుల బెదిరింపులే కారణమని, మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. యువతి బంధువుల ఇళ్లపై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఏఎస్సైతో పాటు పలువురు గాయపడ్డారు.

కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దాసరి వెంకటకృష్ణ అదే గ్రామానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అడ్డు చెప్పిన పెద్దలు యువతికి, మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో వెంకటకృష్ణ.. తాను యువతితో కలిసి దిగిన ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోయిందని తెలిసి మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, యువతి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం వెంకటకృష్ణనేని భావించిన అమ్మాయి తరపు బంధువులు అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories