తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే విషాదం..

nanireddy
Updated on: 24 Dec 2018 4:35 PM IST
తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే విషాదం..
X

తెల్లారితే పెళ్లి నిశ్చితార్థం అవుతుందనగా యువకుడిని మృత్యువు కాటేసింది. బైక్‌ మీద వెళుతూ మృత్యువాత పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన గజ్వేల్‌ లో చోటుచేసుకుంది. మక్త మాసాన్‌పల్లికి చెందిన ఈసకంటి ఎల్లం (22) తాపీ మేస్త్రీ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో తన తమ్ముడు సురేష్‌ ఇద్దరు కలిసి అన్న రామస్వామి సంరక్షణలో ఉంటున్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన సంబరాల్లో తోటి మిత్రులతో కలిసి ఎల్లం పాల్గొన్నాడు. ఆ తరువాత సాయంత్రం తన బైక్‌ మీద నాచారం వెళుతున్నాడు. మార్గంమధ్యంలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దాంతో ఎల్లం తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రమాదానికి గురైనా చాలాసేపటివరకు అతడిని గమనించలేదు. ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు గమనించి అతని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే ఎల్లం మృతిచెందాడు. కాగా ఎల్లంకు బుధవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇంతలోనే బైక్‌ అదుపుతప్పి దుర్మరణం చెందడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.

nanireddy

nanireddy

Next Story