యోగి వేమన సినిమా

యోగి వేమన సినిమా
x
Highlights

కొన్ని సినిమాలు ...క్లాసిక్స్ గా మిగిలి పోతాయి.. అలాంటిదే.. యోగి వేమన. ఈ యోగి వేమన ఒక చక్కటి చలనచిత్రం. ఈ చిత్రంలో వేమన పాత్రధారి ప్రముఖ నటుడు...

కొన్ని సినిమాలు ...క్లాసిక్స్ గా మిగిలి పోతాయి.. అలాంటిదే.. యోగి వేమన. ఈ యోగి వేమన ఒక చక్కటి చలనచిత్రం. ఈ చిత్రంలో వేమన పాత్రధారి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. వేమన ఎల్ల ఉంటాడో తెలియని తెలుగు ప్రజ, నాగయ్యలో వేమనను చూసుకుని పులకించిపొయారు. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశానికి స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్"గా పరిగణింపబడుతున్నాయి. మీరు ఇప్పటికి చూడకుంటే తప్పక చుడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories