వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత..!

X
Highlights
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఆవిర్భావం ...
arun16 Dec 2017 9:36 AM GMT
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నశత్రుచర్ల చంద్రశేఖరరాజు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైసీపీ స్థాపించిన తర్వాత విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి తొలిసారి మద్దతు తెలిపిన వ్యక్తి ఆయన. అయితే, కొంత కాలంగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. కురుపాం నియోజకవర్గ పరిధిలో చినమేరంగి కోటలో నిన్న నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి చంద్రశేఖరరాజు హాజరయ్యారు. టీడీపీలో చేరుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడుని కలిసి టీడీపీ కండువా కప్పుకునేందుకు చంద్రశేఖరరాజు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.
Next Story