వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

x
Highlights

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనాని తమకు మద్ధతిస్తాడంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే తనకు...

వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేనాని తమకు మద్ధతిస్తాడంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రకటించారు. తమపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ తనకు మంత్రి పదవి ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ చురకలంచించారు. పవన్‌పై ఇప్పటికే రెండు సార్లు వరప్రసాద్ మద్దతు విషయంలో వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఇది నిజమా..? కాదా..? అని విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఇదంతా అబద్ధం.. తానెవ్వరికీ మద్దతివ్వనని ఒక్కసారి కూడా పవన్ ఖండించకపోవడాన్ని చూస్తుంటే వైసీపీ నేతల మాటలు అక్షర సత్యమేనేమోనని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై జనసేనికుల సైతం కాస్త డైలామాలో ఉన్నారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories