చంద్రబాబు, లోకేష్‌పై విరుచుకుపడ్డ రోజా..ఎందుకు పనికిరాడంటూ లోకేష్‌పై సెటైర్లు

చంద్రబాబు, లోకేష్‌పై విరుచుకుపడ్డ రోజా..ఎందుకు పనికిరాడంటూ లోకేష్‌పై సెటైర్లు
x
Highlights

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టారంటూ నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సెటైర్లు వేశారు. ఇక ఓటుకు నోటు కేసు...

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టారంటూ నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సెటైర్లు వేశారు. ఇక ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన దద్దమ్మ అంటూ చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories