లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే: రోజా

లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే: రోజా
x
Highlights

తెలుగు దేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమికొడుతారని అందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి...

తెలుగు దేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమికొడుతారని అందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి చంద్రబాబే కారణమని చెప్పిన ఆమె బాబు రాజకీయ నేరగాడు, చేతగాని దద్ధమ్మ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలను చూసి ఏపీ ప్రజలు సంతోషపడ్డారని రోజా పేర్కొన్నారు. లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాల్సిందే అని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని కేసీఆర్‌ సాధించారని కొనియాడారు. జగన్‌ని ఆశీర్వదించిన రోజునే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. గ్రామాల్లో టీడీపీ వాళ్లు కనిపించే పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రకటనలకు ఇచ్చే డబ్బును సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలపై సీఎంది ఒక మాట, మంత్రిది మరోమాట అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు, రేవంత్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని రోజా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories