logo
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు ఊహించని షాక్...సీనియర్ నేత రాజీనామా

X
Highlights

నెల్లూరు జిల్లాలో జగన్ కి ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ బొమ్మిడిరెడ్డి...

నెల్లూరు జిల్లాలో జగన్ కి ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ బొమ్మిడిరెడ్డి రాఘవేంద్రారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ కోసం శక్తి వంచనలేకుండా పనిచేసినా వైసీపీ అధినేత తనను అగౌరపరిచేలా వ్యవహరించారని రాఘవేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంను వెంకటగిరి ఇన్ ఛార్జిగా నియమించడంపై తీవ్ర అసంతతృప్తితో ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన బొమ్మిడిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆత్మగౌరవం లేనిచోట తాను ఉండలేనని చెప్పారు. ఆనం చేరికపై వైసీపీ అధినేత తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదన్నారు. జడ్పీ సభ్యులు వ్యతిరేకిస్తే, చైర్మన్ పదవిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని రాఘవేంద్రరెడ్డి చెప్పారు.

Next Story