మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన యశోద వైద్యులు

మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన యశోద వైద్యులు
x
Highlights

తండ్రి చేతితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆస్పత్రి బృందం ప్రకటించింది. మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన డాక్టర్స్‌...

తండ్రి చేతితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆస్పత్రి బృందం ప్రకటించింది. మాధవి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసిన డాక్టర్స్‌ టీమ్‌ ప్రస్తుతం ఆమె వెంటిలెటర్‌పైనే ఉందని తెలిపారు. అయితే నిన్నటితో పోల్చితే ఇప్పటికి పరిస్థితి మెరుగైందన్న వైద్యులు మరో 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఆస్పత్రికి రాగానే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. కాస్మోటిక్‌, న్యూరో, వాస్కులర్‌ సర్జరీలు సుమారు 6 గంటల పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి మాధవిని కాపాడేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు.

8 గంటల పాటు శ్రమించి రక్తస్రావాన్ని తగ్గించామన్న డాక్టర్లు 6 బాటిళ్ల బ్లడ్‌ను ఎక్కించినట్లు తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఎడమచేయి కేవలం చర్మం పైనే వేలాడుతుందని తెలిపారు. అలాగే మెదడుకు వెళ్లే నరాలను కూడా తాము సెట్‌ చేశామన్నారు. మెడ, ముఖ కవళికకు అందే మూడు నరాలు తెగిపోయాయని తెలిపారు. అంతేకాకుండా సున్నిత ప్రదేశాల్లో తీవ్ర గాయాలయ్యాయన్న వైద్యులు చికిత్సకు మాధవి బాగా స్పందిస్తుందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories