విశాల్ నిన్ను ఆలా చూడాలనివుంది : పరుచూరి గోపాలకృష్ణ

admin
Updated on: 24 Dec 2018 12:15 PM IST

ఆర్కేనగర్ ఉపఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించిన దక్షిణ భారత నటీ నటులసంగం ప్రధాన కార్యదర్శి పందెంకోడి విశాల్ కి ఎలక్షన్ కమిషన్ రూపంలో వచ్చిన ఎదురుదెబ్బ కొంత నిరుత్సహానికి గురిచేసింది.. తన నామినేషన్ పత్రాల్లో బ్యాంకు లావాదేవీలకు సంభందించి సరైన ఆధారాలు చూపించలేదని, అందులో సంతకాలు సరిగా లేవని నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.. కాగా ఈసీ నిర్ణయంపై విశాల్ ధర్నా చేసినా లాభం లేకుండా పోయింది.. దీంతో చేసేదేమియ లేక విశాల్ ఆర్కేనగర్ ఉపఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇదిలావుంటే విశాల్ ని ఎమ్మెల్యే గా , అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడుతుంతే చూడాలని ఉందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు..

admin

admin

Next Story