రెండు రాష్ట్రాల పోలీసులు ధ‌న‌లక్ష్మీ బాధ‌ను తీర్చ‌లేకపోయారు

రెండు రాష్ట్రాల పోలీసులు ధ‌న‌లక్ష్మీ బాధ‌ను తీర్చ‌లేకపోయారు
x
Highlights

మానసిక క్షోభకు గురైన ఓ తల్లి... రోడ్డెక్కింది. పోలీసుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన ఆ తల్లి గుండె తల్లడిల్లింది. ఏం చేయాలో...

మానసిక క్షోభకు గురైన ఓ తల్లి... రోడ్డెక్కింది. పోలీసుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన ఆ తల్లి గుండె తల్లడిల్లింది. ఏం చేయాలో తోచక... చివరికి తనకు న్యాయం చేయాలని, తమ సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధనలక్ష్మీ దీక్ష చేపట్టింది.

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ధనలక్ష్మీకి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. తన పెద్ద కూతురిని ఏడు సంవత్సరాల క్రితం... హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైనప్పటి నుండి ఏదో ఒక కారణంగా తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని, ఇటీవల తన కూతురిని ఫోటోలను అసభ్యకరంగా అంతర్జాలంలో పెట్టి మానసికంగా వేధిస్తున్నాడని ధనలక్ష్మీ ఆరోపిస్తుంది. ఈ విషయంపై ఏపీ, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా... న్యాయం జరగలేదని ఒంటరిగా ధర్నాకు దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories