ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

X
Highlights
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం శవనవారిపల్లెలో...
arun23 Dec 2017 5:02 AM GMT
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం శవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసి అయిన శివను భార్య అరుణ...ప్రియుడితో కలిసి హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని అన్నాసముద్రం అటవీప్రాంతంలో పడేసింది. అయితే శివ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story